Tuesday, July 2, 2024
HomeతెలంగాణErrabelli: సెప్టెంబర్ 4న వల్మీడికి సీఎం కేసీఆర్ రాక

Errabelli: సెప్టెంబర్ 4న వల్మీడికి సీఎం కేసీఆర్ రాక

సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపలో చిన జీయర్ స్వామి

ఆదికావ్యం రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వాల్మీకిపురం కాలక్రమంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో ఆయన నివసించిన మునులగుట్ట పక్కనే గల రాముడు నడయాడిన గుట్ట మీద శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరుగనుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు 4 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలపై ప్రత్యేకంగా రూపొందించిన 6 ప్రచార రథాలతో ఆడియో, వీడియోలతో విస్తృతంగా ప్రచారం చేస్తూ, అందరికీ ఆహ్వానం పలకనున్నారు. దేవాలయ ప్రాంగణంలో ఓ బ్యాగు, పసుపు, కుంకుమ, గాజులు, పులిహోర, లడ్డు ప్రసాదాల పంపిణీ చేయనున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వల్మీడి దేవాలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో ఏర్పాట్లను సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, రామాయణం ఆది కావ్యం. రామాయ‌ణాన్ని సంస్కృతం లో రచించిన వాల్మీకి ఆదికవి. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాతది. అంటే, సుమారు 150వ‌ సంవ‌త్స‌రంలో దేవనాగరి భాషలో రచించారు. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశంలోని అన్ని భాషలేగాక‌, ప్ర‌పంచం న‌లుమూల‌లా రామాయ‌ణం పూజ‌నీయం, ఆచ‌ర‌ణ‌నీయం. ఇంత‌గొప్ప కావ్యాన్ని రాసింది వాల్మీకి మ‌హ‌ర్షి. ఆ వాల్మీకి మ‌హ‌ర్షి మ‌న వ‌ల్మీడికి చెందిన వాడ‌ని మ‌న పూర్వీకులు, చ‌రిత్ర చెబుతోంది. ఆయ‌న పేరునే ఈ గ్రామానికి వాల్మీకిపురంగా పేరు వ‌చ్చింది. కాల‌క్ర‌మేణా ఆ వాల్మీకిపురం కాస్తా… వాల్మీడి.. వ‌ల్మీడిగా మారింది. ఈ గ్రామంలో ఇప్పుడు మ‌నం ఉన్న గుట్ట రాముడి గుట్ట‌. ఈ ప‌క్క‌నే ఉన్న గుట్ట మునుల గుట్ట‌. ఈ మునుల గుట్ట మీదే వాల్మీకి ఘోర త‌ప‌స్సు చేశాడ‌ట‌. దీంతో ఆయ‌న చుట్టూతా పెద్ద వాల్మీకం అంటే… పుట్ట ఏర్ప‌డింద‌ట‌! 24వేల శ్లోకాల‌లో శతకోటి అక్షరాలున్నాయి. ఆ విధంగా రామాయ‌ణం మ‌హా కావ్యం అయింది. ఆ వాల్మీకి మ‌న వాడు, ఇక్క‌డి వాడు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. మ‌నంద‌రికి పుణ్యం. పూర్వ జ‌న్మ సుకృతం. అని మంత్రి వివరించారు. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వల్మీడీలో తలంబ్రాలు పడిన తర్వాతనే భద్రాచలంలో తలంబ్రాలు పడతాయని ప్రతీతి. ఇంత గొప్ప దేవాలయాన్ని పునరుద్ధరించి పూర్వవైభవం తేవాలని సంకల్పించాను. సీఎం కేసీఆర్ గారు అండగా నిలిచారు. అడిగిన వెంటనే నిధులు ఇచ్చి ప్రోత్సహించారు. ఐదు కోట్ల రూపాయలతో వల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత నిధులు పెంచుకుంటూ అభివృద్ధి చేస్తూ పోతున్నామని మంత్రి తెలిపారు.

30 వేల మందికి ఏర్పాట్లు
నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 30 వేల మందికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మీరు షామ్యానాలు టెంట్లు కుర్చీలు ఇతర వసతులతో కూడిన ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఏర్పాట్లపై కమిటీలు
వల్విడి శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా చేయనున్న ఏర్పాట్లకు సంబంధించిన వివిధ కమిటీల రూపకల్పన వాటి పని తీరును మంత్రి అధికారులకు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మాట రాకుండా భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రతి మండలానికి ప్రచార రథం
దేవాలయ పున ప్రారంభం సందర్భంగా తరలివచ్చే భక్తుల కోసం పాలకుర్తి నియోజకవర్గం లోని 6 మండలాలకు ఆరు ప్రచారను ప్రత్యేకంగా రూపొందించారు. అందులో ఆడియో వీడియో సదుపాయాలు కల్పించారు. మండలానికి ఒకటి చొప్పున పాలకుర్తి దేవరుప్పుల కొడకండ్ల పెద్ద వంగర తొర్రూరు రాయపర్తి మండలాలలో ఆయా వాహనాలు విస్తృతంగా తిప్పుతూ ప్రజలకు ఈ కార్యక్రమానికి సంబంధించి న వివరాలను, అహ్వానాలను అందచేయాలని మంత్రి సూచించారు.

మండలాల వారీగా సమన్వయ కమిటీలు
ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఆయా కార్యక్రమాల సమన్వయం చేయాలని అధికారులకు సూచించారు.

ఆ నాలుగు రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడిపించాలని మంత్రి ఆర్టీసీ అధికారులకు చెప్పారు. పాలకుర్తి చుట్టుముంటున్న తొర్రూరు హనుమకొండ వరంగల్ జనగామ డిపోల నుండి బస్సులు ప్రత్యేకంగా వేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. బస్సులు నడిచే సమయాలను ముందే ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలి
పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా ఇతర ప్రాంతాల వారు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి
ఆర్టీసీ పోలీసు ఇతర అధికారులు గుట్ట సమీపంలో కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముందుగానే తగు స్థలాన్ని పరిశీలించి అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసి వాహన సంబంధమైన సమస్యలేవీ రాకుండా రద్దీకి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

ఇంటింటికి స్వామివారి పసుపు, కుంకుమ ప్రసాదాల పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి స్వామి వారి పసుపు కుంకుమలు తీర్థప్రసాధారణ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. అవసరమైతే ఎందుకు దాతలను కూడా ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఓ బ్యాగు, గాజులు, పులిహోర, లడ్డు, తీర్థ, ప్రసాదాల పంపిణీ కి ఏర్పాట్లు చేయాలని మంత్రి వివరించారు.

ఆ నాలుగు రోజులు సంస్కృతిక కార్యక్రమాలు
దేవాలయ ప్రాంగణంలో జరిగే నాలుగు రోజుల ఉత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం ఒక రెండు, మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సినీ నేపద్య గాయని గాయకులు సంప్రదాయ నృత్య కళాకారులు పేరని కళాకారులు శివతాండవం భారత నాట్యం జానపద నృత్యాలు గేయాలు కోలాటాలు వంటి పలు తెలంగాణ కళా ప్రక్రియలో అవినీ దేశం ఉన్న వారిని ప్రత్యేకంగా పిలిపించి సాంస్కృతిక విభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి ట్రస్టు చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ విగ్రహ పున: ప్రతిష్ఠాపన పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానించారు. కనీ వినీ ఎరగని రీతిలో ఈ ఉత్సవాలు జరగాలని అందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డిసిపి సీతారాం, ఎసిపి సురేష్ కుమార్, ఆర్టీసీ, విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు, పంచాయతీరాజ్, దేవాదాయ, డి ఆర్ డి ఓ వంటి వివిధ శాఖల అధికారులు మహిళలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరికీ మంత్రి స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనాలు చేశారు.

క్యాంప్ కార్యాలయం లో అధికారులతో మంత్రి మరో సమీక్ష
అనంతరం మంత్రి పాలకుర్తిలో ని తన క్యాంపు కార్యాలయంలో జనగాం జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఇతర అధికారులు అందరితో కలిసి మరో సమీక్ష సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి వారికి దిశ నిర్దేశం చేశారు అత్యంత వేగంగా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే మరి కొద్ది రోజుల్లోనే బరువు సమీక్ష సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికను పరిశీలిస్తామని ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News