Saturday, October 5, 2024
HomeతెలంగాణErrabelli: సబ్బండ కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Errabelli: సబ్బండ కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బైక్ ర్యాలీలో హుషారుగా మంత్రి..

తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వెంకటాపురం రోడ్డులో రూ.2కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న ఆధునిక దోభిఘాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, అన్నారం రోడ్డులో 1 ఎకరం స్థలంలో 2 కోట్ల రూపాయలతో బెడ బుడిగ జంగాల సంక్షేమ కమ్యూనిటీ భవనానికి జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు* మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 (తెలుగు ప్రభ) తొర్రూరు పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించిన బుడగజంగాలు. స్వయంగా బైక్ నడిపి బుడగ జంగాల యువకులను ఉత్తేజపరిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బైక్ ర్యాలీ. ఎద్దుల బండి పై మంత్రిని ఊరేగింపు తో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం తొర్రూరులోని రామా ఉపేందర్ గార్డెన్ లో జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తొర్రూరులో బుడగ జంగాలకు ఎకరం స్థలంలో సంక్షేమ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన – రెండు కోట్లతో ఆధునిక దోబిఘాట్లకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, సీఎం కేసీఆర్ అన్ని కులాలను, వర్గాలను ప్రజలను సమంగా చూస్తున్నారన్నారు. అడుగంటిపోయిన కులవృత్తులకు సీఎం కెసిఆర్ పునర్జీవం పోశారని ఆయా కులాలు వృత్తుల వారీగా వారి ప్రాధాన్యతలను పట్టి వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

- Advertisement -


తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత గొప్పగా పని చేసిన సీఎంను చూడలేదని పాలకుర్తి నియోజకవర్గాన్ని గతంలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశానని అన్నారు. రజక సంక్షేమ భవనాన్ని కూడా త్వరలోనే నిర్మిస్తానని, తొర్రూరు పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు.చాకలి సామాజిక వర్గం వారు ఎంతో ఓపిక ఉన్న తెలివైన వారని,కెసిఆర్ ప్రభుత్వం లోనే వారికి సరైన గుర్తింపు గౌరవం లభించాయన్నారు.
ఎంతో ఆదర్శవంతమైన జీవనం గడిపే బుడిగజంగాల సమాజం కోసం ఈ రోజు ఎకరం స్థలంలో సామాజిక కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారుబుడిగ జంగాలను.. బుడిగ జంగాలు, బేడ బుడిగ జంగాలు అని, ఇలా రెండు రకాలుగా పిలుస్తారని కథ చెప్పడానికి వాడే బుడికెను కంచుతో గానీ, ఇత్తడితో గానీ తయారు చేస్తారని, మధ్యలో ప్రధాన కథకుడు, ఇరుపక్కలా ఇద్దరు వంతలు పాడే వారు, మంచి వేషధారణ లో ఉంటారని కథలు చెప్పే వాళ్ళు సినిమాల్లో హీరోల లెక్క ఉంటారని గ్రామాల్లో వాళ్లకు చాలా మంది అభిమానులు ఉంటారన్నారు.
వీరు ఒకప్పుడు జంగం (శివుడి) కథలు చెప్పేవారని అందుకే జంగాలు అని పేరు వచ్చిందని అన్నారు.గతంలో మత ప్రబోధానికి, దేశభక్తికీ ప్రతి రూపంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను రాను యాచనకూ, పొట్ట పోసుకోవడానికి ఉపయోగ పడిందన్నారు.మళ్ళీ తిరిగి ఈ నాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నదని అన్నారు. ఇప్పుడు వీరు కుల వృత్తిని కొనసాగిస్తూనే, అనేక వ్యాపారాల్లో స్థిర పడుతున్నారని వీరికి సొంత భాష ఉందని, తెలుగుతో పాటు వారి భాషలో మాట్లాడుతారని,బుడిగ జంగాలు మొదటి నుంచి నాకు అండగా నిలబడ్డారన్నారు.
బుడిగజంగాలు మాట ఇస్తే తప్పరని మాట మీద నిలబడే మంచి మనుషులని వాళ్లకి ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడినని అటువంటిది ఈ రోజు నాకు అవకాశం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు,రజక,బుడగ జంగాల సంఘాల సామాజిక వర్గాల ప్రముఖులు, బాధ్యులు, ప్రజలు ,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొనన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News