Friday, October 4, 2024
HomeతెలంగాణErrabelli: నెల కష్ట పడండి..5 ఏళ్లు సేవ చేస్తా

Errabelli: నెల కష్ట పడండి..5 ఏళ్లు సేవ చేస్తా

నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతా

నా కోసం నెల కష్ట పడండి…5 ఏళ్లు సేవ చేస్తానంటూూ, ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం 10 గ్రామాలకు కోలుకొండ, 12 గ్రామాలకు సింగరాజు పల్లిలలో గ్రామాల వారీగా సమీక్ష సమావేశాలను మంత్రి ఎర్రబెల్లి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల బాగోగులు తెలుసుకున్నారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. గత ఐదేళ్లలో మంత్రిగా నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దాను అన్నారు. ఇంకొన్ని పనులు మిగిలి వున్నాయని, ఎన్నికలు అయ్యాక మన ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పూర్తి చేసి, నాకు ఓటేసిన ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు. సీఎం కెసిఆర్ మనకు శ్రీరామ రక్షని, వారిని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద వుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News