Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్, కేసీఆర్ పుట్టిన రోజును ఇంటింటా జరుపుకోవాలి

Errabelli: తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్, కేసీఆర్ పుట్టిన రోజును ఇంటింటా జరుపుకోవాలి

తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్, ఆయన తెలంగాణ ప్రదాత, భావి భారత విధాత అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజును ఇంటింటా జరుపుకోవాలన్నారు ఎర్రబెల్లి. వరంగల్ సిటీ గ్రౌండ్ లో 3 రోజులపాటు సీఎం కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల ప్రదర్శనను, కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, ఫోటో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రైతు, దళిత బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేసీఆర్ కిట్లు, టీ హబ్, వీ హబ్, ఐ శాట్, పరిశ్రమలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అనేక పథకాల తెలిపే విధంగా నమూనాలను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News