ఐఏఎస్ అధికారులకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నేతల ఆదేశాలు కాకుండా చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. నేతలు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని.. అధికారులు 35 ఏళ్లు సర్వీస్‌లో ఉంటారని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
తాము కూడా ఆరెంజ్ బుక్(Orange Book)లో పద్దతి తప్పిన అధికారుల పేర్లు రాసుకుంటున్నామని.. సమయం వచ్చినప్పుడు వారి సంగతి చెబుతామని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో విద్యావ్యవస్థను మాజీ సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా పాలన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.