Ethanol factory| తీవ్ర వివాదాస్పదంగా మారిన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur ethanol factory)అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీఆర్వో అయోధ్యరెడ్డి ఎక్స్ వేదికగా కీలక పత్రాలను పోస్ట్ చేశారు. అప్పటి మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై ఫ్యాక్టరీకి అనుమతులు ఇప్పించిందే కేసీఆర్(KCR) అని తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు మంత్రివర్గాన్ని ఒప్పించి మరీ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇచ్చారని ఆరోపించారు. టీఎస్ ఐపాస్ సిస్టమ్ ద్వారా అన్ని నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ అనుమతులు ఇప్పించారని విమర్శించారు.
కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థలు ఎన్‌వోసీ(NOC) తీసుకోవాలని అలా చేయకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించిందన్నారు. 2022 అక్టోబర్ 22న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని.. 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం ఎల్‌వోఐ జారీ చేసిందని తెలిపారు. తప్పు మీరు చేసి ఇప్పుడు ఎదురుదాడి విమర్శలేమో సీఎం రేవంత్ రెడ్డిపైనా అని ప్రశ్నించారు. తక్షణమే దిలావర్ పూర్ రైతులకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది ఎవరంటూ ప్రశ్నించారు.