Fake IAS Officer: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమంటే అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలు సాధించాలంటే ఎంతో సన్నద్ధత అవసరం. పట్టువదలని విక్రమార్కుడిలా అహర్నిశలు శ్రమిస్తే తప్పా అలాంటి గౌరవప్రదమైన ఉద్యోగాలు రావు. ఒక్కోసారి ఏళ్లకేళ్లు ప్రయత్నించినా ఆ ఉద్యోగాలు రానివారెందరో ఉన్నారు. సరిగ్గా మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఓ మహిళా కథ అలాంటిదే. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్లుగా ప్రయత్నించినా.. విజయం సాధించలేకపోతుండటంతో ఓ ప్లాన్ వేసింది. తనకు కలెక్టర్‌గా ఉద్యోగంవచ్చిందంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ మేరకు నకిలీ ఉత్తర్వులను సైతం తయారు చేసింది. వాటిని తీసుకుని నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది. తన ఛాంబర్ ఎక్కడంటూ హల్చల్ చేసింది. దీంతో సిబ్బందికి ఆమెపై అనుమానం వచ్చింది.
అసలేం జరిగిందంటే: కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ తాను ఐఏఎస్‌నంటూ హంగామా చేసింది. తనకు ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. అంతే కాకుండా అక్కడే ఉన్న సిబ్బందికి నకిలీ ఉత్తర్వులను సైతం చూపించింది. నేరుగా కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి, తాను ఐఏఎస్‌నంటూ పరిచయం చేసుకుంది. తాను సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కమిషనర్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంది. 4వ తేదీ నుంచి తనను ఆశిష్ సాంగ్వాన్ స్థానంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని ఉత్తర్వులను చూపింది. అనుమానంతో స్థానిక అధికారులు ఆ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు పంపించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/snake-bites-same-person-7-times-in-one-month/
అనుమానంతో అదనపు కలెక్టర్ ఫిర్యాదు: ఆ ఉత్తర్వుల ప్రతిని పరిశీలించిన అదనపు కలెక్టర్.. ప్రభుత్వ పరిపాలన శాఖకు ఆ ఉత్తర్వులను పంపించిన తర్వాత నిర్ణయం చెబుతామని అన్నారు. దాంతో అప్పటిదాకా ఛాంబర్లో కూర్చున్న ఆమె.. వెంటనే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయింది. ఆ తర్వాత అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు


