CM Revanth Reddy| ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన రూ.2లక్షల రైతు రుణమాఫీని ప్రభుత్వం నెరవేర్చడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామంలోని రైతులు తమకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ అభిమానం చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్వీట్లు పంచుకుని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాల్లో తప్పుల కారణంగా రుణమాఫీ కాని 3,13,897 మంది రైతు కుటుంబాలకు రూ.2,747.67 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావటంతో సోమవారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.