Saturday, November 15, 2025
HomeతెలంగాణFFBS leaders demand: ప్రాణాలు తీసే కోనో కార్పస్ చెట్లు తీసేయ్యాలి

FFBS leaders demand: ప్రాణాలు తీసే కోనో కార్పస్ చెట్లు తీసేయ్యాలి

కొనొ కార్పస్ చెట్లతో నగర ప్రజల ప్రాణాలకే ముప్పు

కోనొ కార్పస్ చెట్ల వలన నగర ప్రజల ప్రాణాలకే ముప్పు అని, ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను రామగుండం కార్పొరేషన్ లోని రాజీవ్ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న కొనో కార్పస్ చెట్లను తొలగించాలని ఎఫ్.ఎఫ్.బి.ఎస్ నాయకులు మద్దెల దినేష్ కోరారు. ఈ మేరకు పారిశ్రామిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారికి, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ కు వినతి పత్రాలను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్న తీరులో మరీ ముఖ్యంగా కోనో కార్పస్‌, పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయని ఆయన ఆవేదన చెందారు. ఈ సందర్బంగా నాయకులు రేణికుంట్ల నరేంద్ర, హనుమండ్ల వెంకటేష్, అనిల్ కుమార్ లు నగరంలోనీ కొనొకార్పస్ చెట్లను పరిశీలించారు. అనంతరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్ తో పాటు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు.

- Advertisement -

ఇలాంటి చెట్ల వలన పక్షులకు సరైన ఆవాసం లేక, పునరుత్పత్తి జరగదని, పక్షుల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదముందన్నారు. రామగుండం నగర ప్రజలను దృష్టిలో పెట్టుకొని శ్వాసకోశవ్యాధుల భారిన పడకుండ స్ధానిక ప్రజా ప్రతినిధులు, సంబందించిన అధికారులు చూడల్సిన బాధ్యత ఉందని, త్వరితగతిన
కోనోకార్పస్ చెట్లను రామగుండం నియోజకవర్గంలో పూర్తిగా తొలగించి ఎలాంటి ముప్పు రాకముందే ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈ ప్రాంత పాలకులను, అధికారులను డిమాండ్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad