Saturday, April 12, 2025
HomeతెలంగాణTeegala joins Cong: ఫైనల్లీ.. కాంగ్రెస్ లోకి తీగల

Teegala joins Cong: ఫైనల్లీ.. కాంగ్రెస్ లోకి తీగల

కాంగ్రెస్ లోకి పుంజుకుంటున్న చేరికలు

అందరూ ఊహించినట్టే, ఎట్టకేలకు తీగల కృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ లోకి అధికారికంగా చేరి, పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు ఇన్చార్జి దీపా దాస్ మున్షి. గత కొన్నేళ్లుగా సరైన పదవి, ఛాన్స్ రాక తీగల సైలెంట్ గా అసహనంతో ఊగిపోతుండగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కానీ చేరటంలో బాగా ఆలస్యం కాగా ఎట్టకేలకు ఈరోజు ఆ తంతును పూర్తుచేశారు. ఒకప్పుడు హైదరాబాద్ మేయర్ గా వెలుగు వెలిగిన తీగల ఆతరువాత రాజకీయ ప్రాభవం కోల్పోయి సెకెండ్ ఇన్నింగ్స్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టగా స్థబ్దుగా తయారయ్యారు. మాజీ తెలుగుదేశం నేతలు ఇంకా చాలామంది ఇలా జై కాంగ్రెస్ అనేందుకు సన్నద్ధంగా ఉండగా, ఒక్కొక్కరే అజ్ఞాతం వీడి గాంధీభవన్ బాట పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News