హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. రిషిక కెమికల్ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో దూలపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమా? లేదా మరేదైన ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.