Fire Accident at Katedan: పాశమైలారం అగ్నిప్రమాదం ఘటన జరిగన కొద్ది రోజులకే హైదరాబాద్‌లో మరోసారి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైలారదేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలోని నేతాజీ నగర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. శివం రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలానికి వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -
వెంటనే అక్కడికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోయినా, భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.