Saturday, November 15, 2025
HomeతెలంగాణFire Accident | శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident | శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాప్ లో ఉన్నవారంతా భయంతో పరుగులు పెట్టారు. బట్టల దుకాణం కావడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే ఆ ప్రాంతమంతా మంటలధాటికి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడున్నవారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు రూ . 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad