హైదరాబాద్(Hyderabad) శివారు కొండాపూర్‌లో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. రాజరాజేశ్వరి కాలనీ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.