హైదరాబాద్ కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. జీఏఆర్ భవనంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు వారిని హుటాహుటిన సమీపంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జీఏఆర్ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఈ భవనంలోని ఓ రెసార్టెంట్‌లో సిలిండర్ పేలి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐటీ ఉద్యోగులకు గాయాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES