Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR: కవితపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఉపేక్షించేదే లేదు!

KTR: కవితపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఉపేక్షించేదే లేదు!

KTR respond on Kavitha issue: కల్వకుంట్ల కవిత సస్పెండ్‌పై ఇష్యూపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నాక.. ఇక తాను మాట్లాడాల్సిన పనేలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంతాలకు వ్యతిరేకంగా పనిచేసే.. ఎంతటివారినైనా అలానే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ నేతలందరం గౌరవిస్తామని చెప్పారు.

- Advertisement -

సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయడం తప్పా?: అయితే కల్వకుంట్ల కవిత ఇదే అంశంపై గతంలోనే స్పందించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయడం తప్పా.. అని కవిత బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో భూనిర్వాసితులకు అండగా నిలబడటం తప్పా అని తన ఆవేశాన్ని వెల్లడించారు.

నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా: వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నానని కల్వకుంట్ల కవిత గతంలోనే తెలిపారు. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న అని కేసీఆర్ ని వేడుకున్నారు. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతానని అన్నారు. రేపు కేటీఆర్‌, మీపై కూడా కుట్ర జరగొచ్చని అన్నారు. రేవంత్‌ రెడ్డితో కలిసి హరీష్‌ ఒకే విమానంలో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేశారు. హరీష్‌ రేవంత్‌కు లొంగి కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారని అన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నట్లు కవిత తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad