Saturday, November 15, 2025
HomeతెలంగాణFood Poison | 100 మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్

Food Poison | 100 మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా వీరికి ఫుడ్ పాయిజన్ (Food Poison) అవడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రతిరోజులానే స్కూల్ విద్యార్థులంతా మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. అదే సమయంలో విద్యార్థులు ఒకసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు.

- Advertisement -

దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి ఇళ్లకు పంపించారు. 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరి కొంతమందికి పాఠశాల వద్ద వైద్యుని సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుపై పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad