నేడు తెలంగాణ భవన్ (Telangana Bhavan)కు మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR)రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు కానున్నారు.
ఈ రోజు జరిగే ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం ఉంది.
సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ కచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది.