Saturday, November 15, 2025
HomeTop StoriesHarish Rao : హరీశ్‌రావుకు పితృవియోగం.. తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత!

Harish Rao : హరీశ్‌రావుకు పితృవియోగం.. తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత!

BRS leader Harish Rao bereavement : మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూయడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

కరీంనగర్ జిల్లాలో విషాద ఛాయలు : గత కొంతకాలంగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణరావు, ఈ తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. తండ్రి మరణ వార్త తెలియగానే హరీశ్‌రావు హుటాహుటిన స్వగ్రామానికి పయనమయ్యారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్ : సత్యనారాయణరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీశ్‌రావుకు ఫోన్ చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు, ఇతర పార్టీల నాయకులు సైతం సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించి, హరీశ్‌రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad