Sunday, November 16, 2025
HomeతెలంగాణBandaru Rajireddy: మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి కన్నుమూత

Bandaru Rajireddy: మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి(Bandaru Rajireddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజిరెడ్డి మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు తమ సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

కాగా బండారు రాజిరెడ్డి 1945లో నాచారంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగానూ సేవలు అందించారు. ఇక ఆయన సోదరుడు బండారు లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad