ఫార్ములా ఈ-రేస్(Formula E-Race) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. ఈ రేస్ నిర్వహించిన గ్రీన్‌కో(Greenko) సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ 8- అక్టోబర్ 10 మధ్య గ్రీన్‌కో, దాని అనుబంధ సంస్థలు 26 సార్లు ఈ బాండ్లు కొన్నట్లు పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే తనతో పాటు న్యాయవాదిని లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.