Friday, September 20, 2024
HomeతెలంగాణFoxconn: సీఎం కేసీఆర్ కు లెటర్ రాసిన ఫాక్స్ కాన్

Foxconn: సీఎం కేసీఆర్ కు లెటర్ రాసిన ఫాక్స్ కాన్

గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి..,
గౌరవ ముఖ్యమంత్రి గారు,
హైద్రాబాద్ పర్యటన సందర్భంగా నాకు, నా బృందానికి మీరిచ్చిన ఆతిథ్యానికి ముందుగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. హైద్రాబాద్ లో మేము అద్భుతమైన సమయాన్ని గడిపాము. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మీరు స్వదస్తూరితో రాసి గ్రీటింగ్ కార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ పరిణామం, అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి, మీ దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది. భారత దేశంలో నాకో కొత్త మిత్రుడు లభించాడు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను.
మార్చి 2 వ తేదీన మీతో సమావేశం సందర్భంగా చర్చించినట్టు, త్వరలోనే కొంగర కలాన్ లో మా సంస్థ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఫాక్స్ కాన్ కట్టుబడి వుంది. ఈ దిశగా మీము చేపట్టబోయే కార్యాచరణలో మీరు సంపూర్ణ మద్దతు నివ్వాలని కోరుతున్నాను.
మీరు నా అతిథిగా తైవాన్ కు రావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తైపీ’ లో మీకు ఆతిథ్యమివ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే మీతో మరోసారి సమావేశానికి ఎదురుచూస్తూ..
భవదీయ
యంగ్ ల్యూ
చైర్మన్
హోన్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీ కం.లి.( ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News