రజనీ ఫెర్టిలిటీ సెంటర్, శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించు ఉచిత ఫెర్టిలిటీ వైద్య శిబిరాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రం లోని రేనే హాస్పిటల్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేని హాస్పిటల్ చైర్మన్ పో.డా. బంగారు స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు నేడు సంతానలేమి లేదా వంధ్యత్వ సమస్య జంటలకు వేధిస్తున్నది. నేడు మనదేశంలోని 14 శాతం జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని, ఆధునిక జీవన శైలితో రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రెనీ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన ఉచిత సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలను ఎంపిక చేసే శిబిరాన్ని ప్రారంభించారు.
లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన 10 మందికి ఉచిత ఐవిఎఫ్ చికిత్సలు చేస్తామని, శిబిరంలో పాల్గొన్న ఇతర జంటలకు తక్కువ ఖర్చుతో ఐవిఎఫ్ ప్రక్రియను చేస్తామని తెలియజేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న జంటలు నేటి నుంచి 08 మార్చి 2024 వరకు డా. రజని ప్రియదర్శినిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తమ అమ్మ నాన్నల పేరున 10 మందికి ఉచిత కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నామని, అదే విధంగా ఉచిత ఐవిఎఫ్ చికిత్సను 10 మంది నిరుపేదలకు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర సీనియర్ వైద్యులు మాట్లాడుతూ డా. బంగారు రజనీ స్వామి జంట ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఏటా 20 మంది పేదలకు ఉచితంగా చికిత్సలు/ఆపరేషన్లు అందించడం హర్షదాయకం అని అన్నారు. శరీరతత్వం, జీవనశైలి, పెళ్లి వయస్సు లాంటి అనేక కారణాలతో సంతానలేమి క్రమంగా పెరగడం గమనిస్తున్నామని, ఈ సంతానలేమి సంక్షోభంతో సమాజం ప్రతికూల ప్రభావాలను చూడనుందని వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా బి ఎన్ రావు, డా. రామ్ కిరణ్, టి.ఎం.ఎస్ ఈ సభ్యులు డా. బండారి రాజ్ కుమార్, సీనియర్ వైద్యులు డా. అలీం, డా. శేష శైలజ, డా. కొల్లూరి రాధ, డా. విజయలక్ష్మి, సీనియర్ న్యాయవాది అంబళ్ళ మాధవి, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డా. కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఆచార్యులు డా. సరసిజ, పరిపాలనాధికారి అరవింద్ రావు, రెనీ ఆసుపత్రి సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.