ప్రతి ఏడాది హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నుమాయిష్(Numaish) నిర్వహణ తేదీలు ప్రకటించారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో(Nampally Exhibition Ground) నుమాయిష్ జరుగనుంది. ఈమేరకు 84వ అల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పాల్గొని నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు.
కాగా 46 రోజుల పాటు జరగనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో 2వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు .అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్, వాలంటీర్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు.