Hydra| తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లోని చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడటానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో హైడ్రా(Hydra) అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పలు చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారి రంగనాథన్‌ను కమిషనర్‌గా నియమించిన విషయం విధితమే.
ఇప్పటికే హైడ్రాకు విస్తృత అధికారాలను కట్టబెడుతూ ప్రత్యేక బిల్లును కూడా ప్రభుత్వం రూపొందించింది. తాజాగా భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.