Friday, September 20, 2024
HomeతెలంగాణGadwala sarees: గద్వాల ప్రత్యేకతలు ఎన్నో

Gadwala sarees: గద్వాల ప్రత్యేకతలు ఎన్నో

భారతదేశంలోనే గద్వాల పట్టు చీరలకు ప్రసిద్ధి. భారతదేశంలో 546 సంస్థానాలలో గద్వాల సంస్థానం ఘనమైన చరిత్రలో ప్రత్యేకత కలిగి ఉన్నది. ప్రపంచంలో 18 శక్తి పీఠాలలో (ఐదవ శక్తిపీఠం ) అతి శక్తివంతమైన పీఠం జోగులాంబ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, బాలబ్రహ్మేశ్వర దేవాలయాల సముదాయం గద్వాల్ జిల్లాలోనే ఉన్నది.
కృష్ణ , తుంగభద్ర ( రెండు నదుల మధ్య ప్రత్యేక నదీపరివాహక ప్రాంతం. నడిగడ్డగా ప్రసిద్ధి చెందిన గద్వాల సంస్థానము తిరుపతి వెంకట కవులను సన్మానించి విద్వద్గద్వాల్ గా ప్రశస్తి పొంది కర్నాటక రాయచూర్ సంస్థానాన్ని గడగడలాడించిన చరిత్ర గద్వాలకు ఉంది. తెరు మైదానం , రైల్వేస్టేషన్ , ఆదిపరాశక్తి జమ్మలమ్మ తల్లి దేవాలయం, మల్దకల్ తిమ్మప్ప(పేదవాడి తిరుపతి) లక్ష్మీవెంకటేశ్వర స్వామి, సద్దాలోని పల్లి శ్రీ స్వయంభూ కృష్ణ స్వామి, బీచుపల్లిలో శ్రీఆంజనేయ స్వామి, బాసర సరస్వతి దేవి, కోదండరామస్వామి దేవాలయాల సముదాయం,పెద్ద చింతరేవుల కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామి , పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మొదలైన దేవాలయాలతో అలారారుతున్నంది.

- Advertisement -

అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నీటి బావులు:లింగమ్మ బాయి, చొక్కమ్మ బాయి, చేపల బాయి, బండల బాయి, దొరబాయి, మునిసిపాలిటీలో ఉన్న బావి, గద్వాల కోటకు 19 బూజులు, చెన్నకేశ్వర స్వామి జాతర, సంతాన వేణుగోపాల స్వామి నది అగ్రహారంజాతర, గద్వాల సంస్థానానికి రాజధాని పుడూరు, శనిగనిపల్లి ప్రాంతాలు కలవు , పాత బస్టాండ్ దగ్గర రాజుల ఫిరంగి, కృష్ణారెడ్డి బంగ్లా, గద్వాల్ సంత ప్రతి సోమవారం, రాయచూర్ రోడ్డు మార్గంలో సంగాల పార్కు ప్రత్యేకత,44 జాతీయ రహదారి ఎర్రవల్లి చౌరస్తా, గద్వాల్ టు ఐజ వైపు మంత్రాలయం రోడ్లు, దక్షిణ మధ్య ఉన్న గద్వాలకు కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హద్దులుగా ఉన్నాయి.ఇవన్నీ గద్వాల వన్నె తెచ్చే ప్రత్యేకతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News