Saturday, October 5, 2024
HomeతెలంగాణGajwel: కేసీఆర్ అన్నదాంట్లో జోక్ ఏముంది? హరీష్ రావు

Gajwel: కేసీఆర్ అన్నదాంట్లో జోక్ ఏముంది? హరీష్ రావు

నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్ రావు.. ఆమె మాటలు అవాస్తవాలు, అబద్దాలన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడింది వందకు వంద శాతం నిజమన్న ఆయన.. సంకుచిత భావాలతో చిన్నగా ఆలోచించే దాన్ని సీఎం తప్పు పట్టారన్నారు. అన్ని ఆధారాలు, లెక్కలతో సీఎం కేసీఆర్ మాట్లాడారన్నారు హరీష్. 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు సాధించింది 3.3 ట్రిలియన్ మాత్రమే. ఒక్క ఏడాదిలో మిగతా లక్ష్యాన్ని సాధించడం సాధ్యమా.. సీఎం కేసీఆర్ గారు ఇదే కదా అడిగింది. అందులో జోకు ఏముందని ఆయన నిలదీశారు. నిజాలు చెప్పలేక వ్యంగ్యంగా మాట్లాడి తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News