Ganesh immersion: వినాయక చవితి ఉత్సవాలు అంటేనే ముంబై, హైదరాబాద్ గుర్తుకు వస్తాయి. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు గుర్తస్తారు. ఇక లడ్డూ వేలం అనగానే బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట గుర్తస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా నుంచి హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లోసైతం లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గల గణపతి లడ్డూ రికార్డు ధరను సొంతం చేసుకుంది.
గత రికార్డు బద్దలు: రాజేంద్రనగర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. శుక్రవారం జరిగిన వినాయక లడ్డూ వేలంలో ఈ లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లు పలికింది. గత సంవత్సరం అనగా 2024లో ఇదే లడ్డూ రూ. 1.87 కోట్లు పలికింది. గత రికార్డును ఈ ఏడాది బద్దలు కొట్టింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/balapur-laddu-auction-2025-record-price/
సేవా కార్యక్రమాలకు ఖర్చు:ఈ వేలంలో దాదాపు 80 విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడ్డారు. 500కు పైగా బిడ్లతో పాల్గొన్నారు. ఈ వేలం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్ వీ దియా చారిటబుల్ ట్రస్ట్ అందించనున్నారు. దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా, నిరుపేద విద్యార్థులకు, వృద్ధాశ్రమాలకు సాయం చేయనున్నట్లు తెలిపారు.


