Friday, November 22, 2024
HomeతెలంగాణGangula: నేను ఎవరి జోలికెళ్ళ.. నా జోలికొస్తే ఊరుకోనూ

Gangula: నేను ఎవరి జోలికెళ్ళ.. నా జోలికొస్తే ఊరుకోనూ

పొన్నం ఔట్ డేటెడ్ లీడర్

కాంగ్రెస్ నేత… మాజీ ఎంపి పొన్నం ఔట్ డేటెడ్ నాయకుడని… ఆయనను ప్రజలు మరచిపోయారని బిసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు… నేడు కరీంనగర్‌ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడేందుకు ఆయనే కారణమని… గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకటంటే… ఒక్క సీటు గెలుచుకోలేదన్నారు. చివరకు పొన్నం ప్రభాకర్ డివిజన్ లోనే బిజెపి గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్… బిజెపిలు రెండు ఒకటేనని… పొద్దంతా తెలంగాణ పై విషం చిమ్మే ఈ నాయకులు… రాత్రివేళ మాట్లాడుకునే తత్వం వారిదన్నారు. కాంగ్రెస్… బిజెపిలు ఒకటేననడానికి హుజురాబాద్… మునుగోడు ఎన్నికలు నిదర్శనమన్నారు. ఐదు సంవత్సరాల్లో 4 సంవత్సరాల 9 నెలల పాటు కనిపించకుండా పోయిన ఈ నాయకులు… ఇప్పుడు ఎన్నికల వేళ మేమున్నామని… రాజకీయ గుర్తింపు కోసం మళ్ళీ వస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్… బిజెపి లు 2వ స్థానం కోసం కోట్లాడుకుంటున్నాయన్నారు. బండి సంజయ్ పార్టీ బిజెపి అయితే… నాది బిఆర్ఎస్ అని… ఎవరి పార్టీలకు అనుగుణంగా వారిమి పనిచేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ సైతం నాకు బాల్యస్నేహితుడేనని… మాకు రాజకీయ విభేదాలు తప్ప… వేరే ఏమి లేవన్నారు. నా వ్యాపారాల పై కూడా ఎంతో మంది ఫిర్యాదులు చేసి… జైలుకు పంపించేందుకు కుట్రలు పన్నారని… కాని ఏమి లేదని అధికారులు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. బండి సంజయ్ మా కెసిఆర్ సార్ ను అంటే… మేము ఆయనను అంటామన్నారు. నేను ఎవరి జోలికి పోనని… నా జోలికి వస్తే మాత్రం వదలనన్నారు.ధాన్యం కొనుగోళ్లపై కూడా అసత్యపు ఆరోపణలు చేసినా నాయకులు నేడు బీసీలకు అందించే లక్షా ఆర్థిక సహాయంపై కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు..

- Advertisement -

అర్హులైన బీసీలందరికీ విడతల వారీగా సహాయం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వద్దు అన్న పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓట్లకోసం గ్రామాల వెంట పడుతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News