వెనుకకునెట్టేయబడ్డ వర్గాలకు సీఎం కేసీఆర్ విద్యను అందించి వారి సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగపర్చడానికి విశేష కృషి చేస్తూ వెనుకబడిన వర్గాల విద్యాప్రధాతగా మారడన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. సీఎం ఆదేశాల మేరకు నేడు బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు కాస్మెటిక్, బెడ్డింగ్ మెటీరియల్, వులన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేసే ఉత్తర్వులను జారీ చేసామని నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకునే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన బోజన, వసతులతో అధనంగా ప్రీమెట్రిక్ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందుతాయన్నారు మంత్రి గంగుల. ఏటా 12 కోట్లను అధనంగా కేటియించడం ద్వారా దాదాపు 34వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు.
కేవలం 19 ఉన్న బిసి గురుకులాలను ఇప్పటికే 327కు పెంచడమే కాకుండా, మహాత్మా జ్యోతీబాపూలే పేరున ఒక్కో విద్యార్థికి 20లక్షల విదేశీ విద్యానిది, రాష్ట్రంలోని విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ అందజేస్తున్నామని, ఈ ఏడు నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో చదివే వెనుకబడిన వర్గాల బిడ్డలకు సైతం ఫీజులను చెల్లించబోతున్నామన్నారు. చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బిసి విద్యార్థుల చదువుకు ఊతమిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని, ఆయనకు యావత్ బిసి సమాజం పక్షాన ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.