Friday, November 22, 2024
HomeతెలంగాణGangula: కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్ మస్తి

Gangula: కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్ మస్తి

నయా జోష్ నింపనున్న కేబుల్ బ్రిడ్జి

కేబుల్ బ్రిడ్జిపై ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సాయంత్రం కేబుల్ బ్రిడ్జిపై ప్రారంభించనున్న వీకెండ్ మస్తి సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు ఎమ్యేల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,ఈవెంట్ మ్యానేజ్మెంట్లు, ఇతర అధికారులతో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న వీకెండ్ మస్తి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేబుల్ బ్రిడ్జిపై ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహించనున్న వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని , స్వాతంత్య్ర దినోత్సవం నాటి సాయంత్రం నుండి ప్రారంభించనున్న తరుణంలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంనాడు నిర్వహించిన కార్యక్రమాలను మరిపించేలా ప్రజలకు ఆనందంతో పాటు ఉత్సహాన్ని కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ స్టాళ్లు ఇతర ఏర్పాట్లు జరగాలని సూచించారు. అదే విధంగా పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని స్టాళ్లను ఏర్పాటు చేసిన చోట, ఇతర ప్రాంతాలలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని, ఫుడ్ స్టాళ్లు కచ్చితమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని, స్టాళ్ల ఏర్పాటుకు ఎటువంటి ఫీజు వసూలు చేయరాదని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సూడా చైర్మన్ జివి రామకృష్ణారావు.. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కరీంనగర్ ఆర్డిఓ కె. మహేష్, మున్సిపల్ కమీషనర్ సేవాఇస్లావత్, ఈఈ ఇరిగేషన్ సాంబశివ రావు, చల్ల హరి శంకర్, ఆకుల ప్రకాష్ మున్సిపల్ ఎస్ఈ, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు, ఈవెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News