Friday, September 20, 2024
HomeతెలంగాణGangula: ఘనంగా సర్దార్ పాపన్న జయంతి

Gangula: ఘనంగా సర్దార్ పాపన్న జయంతి

సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అలుగునూర్ లోని
మానేరు బ్రిడ్జి వద్ద నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరై సర్వాయి పాపన్న విగ్రహా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడు తూ… తెలంగాణ రాకముందు పోరాట యోధులను, మహానీయులను సమైక్య ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోరాట యోధులను, మహనీ యులను బాహ్య ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. బహుజనుల, అణగారిన, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన వీర పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తుందని, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతఒక్కరు ఆదర్శంగా తీసుకోని రాజ్యాధికారమె లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆయన చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని పునరుద్ఘాటించారు. పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచారాని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు సల్ల శారద-రవీందర్, తోట రాములు, గుగ్గిళ్ల జయశ్రీ, సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ఘనగాని సత్యనారాయణ గౌడ్(కలర్ సత్తన్న), గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుగ్గిల్ల శ్రీనివాస్ గౌడ్, గోప జిల్లా అద్యక్షులు నర్సయ్య గౌడ్, గోప కార్యదర్శి జక్కని మల్లేశం గౌడ్, నాయకులు పెంటయ్య గౌడ్, తిరుపతి గౌడ్, దులం సంపత్ గౌడ్, తాల్లపల్లి హరి కుమార్ గౌడ్, జక్కని వీరస్వామి గౌడ్, తాల్లపల్లి ఎల్లాగౌడ్, గణపతి గౌడ్ తో పాటు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గౌడ కులస్తులు, అభిమా నులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News