Saturday, November 23, 2024
HomeతెలంగాణGangula: ప్రపంచ స్థాయి పర్యాటక నిర్మాణం మానేరు రివర్ ఫ్రంట్

Gangula: ప్రపంచ స్థాయి పర్యాటక నిర్మాణం మానేరు రివర్ ఫ్రంట్

మానేరు రివర్ ఫ్రంట్ కోసం ఫారిన్ టూర్

కరీంనగరాన్ని జిల్లాను అని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అంటూ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కెసిఆర్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కరీంనగర్లోనే తొలిసారి పర్యటించి, జీవో నెంబర్ 4తో నగర రూపురేఖలను మార్చారన్నారు గంగుల. కరీంనగర్ ను ఆనుకొని ఉన్న 24 టీఎంసీల మానేరు జలాశయాన్ని… పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన గత పాలకులకు రాలేదని, మానేరు నది తీరాన్ని పర్యాటకగా కేంద్రంగా మార్చుతామని సీఎం కేసీఆర్ అంటే ఎంతోమంది వ్యంగ్యంగా నవ్వారని గతాన్ని గుర్తుచేశారు మంత్రి. కానీ జరిగిన అభివృద్ధిని చూసి నాడు నవ్విన నోరులే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయని, ఎవరు కితాబిస్తారని మేము పనిచేయడం లేదని గంగుల చెప్పుకొచ్చారు. 9 ఏళ్లలోనే కరీంనగర్ రూపురేఖలు మార్చి… హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా తీర్చిదిద్దామనిస తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కు సరికొత్త సొబగులు అద్దాలని ఇప్పుడు మేము సింగపూర్, సీయోల్… ఒస్సొలొ పర్యటిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News