Friday, November 22, 2024
HomeతెలంగాణGangula: స్పూర్తిప్రదాత కొండాలక్ష్మణ్ బాపూజి

Gangula: స్పూర్తిప్రదాత కొండాలక్ష్మణ్ బాపూజి

తెలంగాణ స్వాతంత్య్ర సమయయోధుడు, బడుగు, బలహీన వర్గాల స్పూర్తిప్రదాత కొండలక్ష్మణ్ బాపూజి సేవలు స్మరించుకుంటూ ఆయన సేవలను భావితరాలకు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉజ్వలపార్కు ఎక్స్ రోడ్డు వద్ద ఆయన విగ్రహనికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ గర్వించదగ్గ గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ మహోద్యమంలో విరోచితంగా కృషిచేసిన స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులను స్మరించుంటూ కొండాలక్ష్మణ్ బాపూజి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

- Advertisement -

తెలంగాణ గర్వించదగ్గ గొప్పవ్యక్తి, పదవులు ముఖ్యంకాదు తెలంగాణ ఆవిర్బావమే ముఖ్యమని, నా కొసం కాదు రేపటి భావితరం గొప్పగా జీవించాలని మంత్రి పదవిని తృణపాయంగా వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజి అని అన్నారు. 91 ఏళ్ల వయస్సులో కూడ తీవ్రమైన చలిలో డిల్లీలో తెలంగాణ ఆవిర్బావం కొరకు కొండాలక్ష్మణ్ బాపూజి పోరాటం చేశారని మంత్రి గుర్తుచేశారు. మలి దశ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని, తెలంగాణ ఆవిర్బావాన్ని కూడా చూడకుండానే స్వర్గస్తులయ్యారని. తెలంగాణ ఆవిర్బావం కొరకు విరోచితంగా కృషిచేసిన ఆయనకు సముచిత గౌరవాన్ని అందించేదిశగా జిల్లా కేంద్రంలో జిల్లా ముఖద్వారం ప్రారంభంలోని చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కె.వై.సి ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డుతో అప్ డేట్ చేసుకోవాల్సి ఉన్నందున విదేశాలలో, ఇతర ప్రదేశాలలో పనుల కొరకు వెళ్లిన వారికి ఇబ్బందులు లేకుండా రేషన్ కార్డు దారుల్లో ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని, కార్డుదారులకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తు అండగా నిలుస్తుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. బి. గోపి, నగర మేయర్ వై. సునీల్ రావు, కరీంనగర్ ఆర్డీఓ కె. మహేశ్వర్, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు,జిల్లా బిసి సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, చేనేత జౌళీ శాఖ ఏడి సంపత్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, అధ్యక్షులు మెతకు సత్యం, కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్, ఎడ్ల అశోక్, ఎల్.స్వప్న వేణు, కాశెట్టి శ్రీనివాస్, పద్మశాలి రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు స్వర్గం మల్లేశం, బిసి సంఘ నాయకులుపి. సత్యనారాయణ, గడ్డం శ్రీరాములు, రుద్రరాజు, వేముల చంద్రశేఖర్, నరసయ్య, గున్నాల రమేష్, ఏ భూమయ్య, గడ్డం వెంకటేశం, దీకొండ లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, తాడిచర్ల రాజు, పి. శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News