ధాన్యం కొనుగోలుపై హైదరాబాదులోని సచివాలయ ఛాంబర్ లో సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సాగింది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సివిల్ సప్లై శాఖ అధికారుల నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సత్వర ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ గోదాముల్లో ధాన్యం దిగుమతికి కాళీ లేనందున ప్రైవేటు గోదాములలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసుకుని దిగుమతి చేసి రైతుల ఎకౌంట్లో నగదు జమ చేసేటట్లు ఏర్పాట్లు చేసేటట్లు సమీక్షించారు. ఖమ్మం జిల్లాలోని మిల్లులకు మించి ధాన్యం ఉండటంతో ఇతర జిల్లాలకు మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేటట్లు నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.