33జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో హైదరాబాద్లోని కార్పొరేషన్ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్ కార్డులను అందజేశారు. సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని ఆదేశించారు. డిఫార్మెంట్లోని ప్రతీ ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు సేవలందించాలన్నారు. ఇటు రైతుల పంటను సేకరిస్తూ దాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి పేదలకు రేషన్ ద్వారా పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సప్లైస్ ఉద్యోగులు మద్యతరగతి వాడుకునే వినియోగ వస్తువుల బ్లాక్ మార్కెట్ని అరికట్టి, ధరల స్థిరీకరణలో ఘనమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. కార్పొరేషన్లోని 244 మంది ఉద్యోగులకు వారి కుటుంభ సభ్యులకు ప్రభుత్వ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సేవల్ని ప్రారంభించామన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్ని ఉపేక్షించమని, ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.