Tuesday, September 17, 2024
HomeతెలంగాణGaridepalli: ఇండిపెండెన్స్ డేలో సతీష్ డప్పు కళా బృందం ప్రదర్శన

Garidepalli: ఇండిపెండెన్స్ డేలో సతీష్ డప్పు కళా బృందం ప్రదర్శన

మహిళలే డప్పులు..

హైద్రాబాద్ లోని గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హుజుర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ డప్పు కళా బృందం మహిళా డప్పు కళాకారులు పాల్గొంటున్నారు. సతీష్ డప్పు కళా బృందం ప్రతిభను చాటనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్ మామిడి హరికృష్ణ సహకారంతో అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో డప్పు ప్రదర్శనకి అవకాశం రావడం సంతోషకరం అని అన్నారు.

- Advertisement -

మహిళలే డప్పులు కొట్టడం పల్లెటూరు నుండి రాష్ట్ర రాజధానిలో డప్పు కొట్టడం ఆనందంగా ఉంది అని మాస్టర్ అమరవరపు సతీష్ పేర్కొన్నారు. గోల్కొండ కోటలో పాల్గొనే డప్పు కళాకారులు అందరు హుజుర్ నగర్ నియోజకవర్గానికి చెందిన వారే కావడం సంతోషకరంగా ఉన్నది అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News