శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం సమీపంలో నివసించే అలవాల నవీన్ స్వాతి దంపతుల గారాలపట్టి వేదకు రంగురంగుల నూతన వస్త్రాలతో గోపిక వేషధారణ గావించారు.
పాలకుండ చేత భూనిన గోపిక వేషధారణలో ఇంటి నుండి పాఠశాలకు వెళ్తున్న చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గోపిక వేషధారణలో తీర్చిదిద్దిన చిన్నారి తల్లిదండ్రులు అలవాల నవీన్ స్వాతి మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, మహా భారతం ఇతిహాసా గట్టాలపై అవగాహన కల్పించేందుకు తమ ఇంట్లో చిన్నారులకు శ్రీకృష్ణుడు రాధా గోపిక వేషధారణలు వేస్తున్నామని పేర్కొన్నారు.
తాత నాయనమ్మలు అలవాల రామకృష్ణ సత్యావతి చిన్నారికి గోపిక వేషధారణ వేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. గోపిక వేషంలో ఉన్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.