అమ్మ గురించి ఎంతోమంది కవులు, రచయితలు చాలా విధాలుగా వర్ణిస్తూనే ఉంటారు. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఈ జగతిలో భగవంతుడు ఎత్తిన 11వ అవతారమే అమ్మ అంటూ గార్లకు చెందిన డ్రాయింగ్ టీచర్ సూక్ష్మ కళాకారుడు ఎట్టి రామకృష్ణ మదర్స్ డే సందర్భంగా బాదం ఆకుపై తల్లి బిడ్డల చిత్రాలు చిత్రించి తల్లిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు.
- Advertisement -
తల్లి గొప్పదనం ధీరత్వం ఎత్త చెప్పినా తక్కువే అంటున్నారు. గార్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తూ పిల్లలకు చిత్రలేఖనంపై మెళకువలు నేర్పిస్తూ, రావి బాదం అనేక ఆకులు చాక్ పీసులపై పలు చిత్రాలు రూపొందించాడు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆకుపై తల్లి బిడ్డల చిత్రాలు చిత్రీకరించి పలువురి మన్నలు పొందాడు.