Saturday, September 28, 2024
HomeతెలంగాణGarla: ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Garla: ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాశాలలో జనరల్ కోర్సులైన ఎంపీసీ బీపీసీ హెచ్ఈసీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతానికి 70 అడ్మిషన్లు పైగా జరిగాయని విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలన్నారు.

- Advertisement -

గడిచిన విద్యాసంవత్సరాలలో సైన్స్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగాలలో కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి సీట్లు సాధించారని, కళాశాలలో అనేక వసతులతో పాటు
రూపాయి ఫీజు లేకుండా ఉచిత అడ్మిషన్, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, అనుభవం కలిగిన అధ్యాపకుల తో నాణ్యమైన విద్యాబోధన, అన్ని సౌకర్యాలు కలిగిన సైన్స్ ల్యాబ్స్, అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్ సౌకర్యం, విశాలమైన క్రీడా మైదానం, సైన్స్ విద్యార్థులకు ఐఐటి జేఈఈ నీట్ ఎంసెట్ స్థాయిలో విద్యాబోధన, లైబ్రరీ- రీడింగ్ రూమ్ వసతి సౌకర్యంతో పాటు బస్సు పాస్ సౌకర్యం కూడా ఉందని, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ పర్యావరణ చైతన్యం వంటి కార్యక్రమాలు ఉన్నాయని యాజమాన్యం వెల్లడిస్తోంది. ఇంగ్లీష్-తెలుగు మాధ్యమాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇందుకు పదవ తరగతి ఇంటర్ నెట్ మెమోలు మూడు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News