Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: పాకాల ఏటి కష్టాలు ఇంకెన్నాళ్లు?

Garla: పాకాల ఏటి కష్టాలు ఇంకెన్నాళ్లు?

వానోస్తే 11 గ్రామాలకు రాకపోకలు బంద్

పాకాల ఏటి కష్టాలు తమకు ఇంకెన్నాళ్లు అని రాంపురం మద్దివంచ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నా వినేవారు కరువయ్యారు. గార్ల మండల పరిధిలోని రాంపురం, మద్దివంచ, కొత్త తండా, పులిగుట్ట తండా, రాము తండా, పరిసర గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఘోరంగా ఉంటుంది. అంటే ఇక్కడి వర్షాలకు కనీసం 11 గ్రామాలకు రాకపోకలు ఉన్నట్టుండి ఆగిపోతాయన్నమాట.

- Advertisement -

గార్ల సమీపంలో ఉన్న పాకాల ఏరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా అది ఇప్పటికీ తీరని కలగానే మిగిలిపోయింది. ప్రతి వర్షాకాలం పాకాల ఏరు ప్రమాదకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పాకాల ఏటిపై హై లెవల్ వంతెన నిర్మించాలని ప్రజలు దశాబ్దాల కాలం నుంచి కోరుతున్నప్పటికి గత పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఎలక్షన్ సమయంలో హై లెవెల్ వంతెన కడతామని ప్రభుత్వాలు హామీలను గుప్పిస్తూ వంచిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తమకు మరణమే శరణ్యమా అని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకాల ఏరు ఉప్పొంగి ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు చావు అంచులకు వెళ్లి బతికి బట్ట కట్టారు. కొంతమంది మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి ప్రతి ఏడాది ఇలా ప్రమాదాలు షరా మాములే అన్న చందంగా అధికారులు వ్యవహారిస్తుండటంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పాకాల ఏటి వద్ద ప్రమాదాల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి కంటి తుడుపు చర్యలు కావడంతో ప్రమాదాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రాత్రి కురిసిన వర్షానికి చెక్ డాంపై నుంచి ప్రవహిస్తున్న నీటితో సిమెంట్ బిళ్ళలు కొట్టుకుపోయాయి గతంలో కంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలుఎక్కువ ఉన్నాయి.

గత ప్రభుత్వ హామీలకే దిక్కు లేదు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధులు పాకాల ఏటిని సందర్శించి హై లెవెల్ వంతెన నిర్మిస్తామని నిధులు మంజూరయ్యాయని పనులు ప్రారంభిస్తామని శంకుస్థాపన చేసి వంతెన కట్టకుండానే వంచించారు.

వర్షాకాలంలో రైల్వే బ్రిడ్జి శరణ్యం
వర్షాకాలంలో పాకాల వరద ఉధృతతో నెల పాటు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంపురం, పులిగుట్టతండ, కొత్తతండా, మద్దివంద గ్రామాలకు చెందిన సుమారు 3వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వర్షాకాలంలో పాకాల ఏరు ప్రవహిస్తున్న సమయం లో రాకపోకలు నిలిచిపోతాయి. రైతులు ఎరువులు, పురుగు మందులు తెచ్చుకోవాలన్నా సుదూరప్రాం తాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెక్ డ్యాం దాటుతూ ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు పాకాల ఏటి
లో కొట్టుకుపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రైతులు నిత్యావసర పనులకు ఆస్పత్రులకు బడిపిల్లలు గార్లలోని ప్రైవేట్ పాఠశాలలకు రావాలంటే రహదారి లేకపోవడంతో రైల్వే బ్రిడ్జిపై నుంచి మూడు కిలోమీటర్లు బిక్కుబిక్కుమని నడుచుకుంటూ వస్తుంటారు.

హై లెవెల్ వంతెన కష్టాలు తీర్చాలి

కనీసం ఈ ప్రభుత్వంలోనైనా రాంపురం గార్ల మధ్యల గల పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టి రహదారి సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News