గార్ల మండల కేంద్రంలోని స్థానిక డిగ్రీ కళాశాలలో ఎస్బిఐ బ్యాంకు ఫైనాన్షియల్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నరసమ్మ మాట్లాడుతూ ఆనాటి సమాజంలో వస్తు మార్పిడి విధానం నుండి నగదు బదిలీ నేటి సమాజంలో డిజిటల్ మనీ అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది బ్యాంకు వ్యవస్థ నేటి తరానికి రాబోయే తరానికి బ్యాంకు వ్యవస్థ జీవితంలో ఒక భాగం అవుతుందని విద్యార్థులకు తెలియజేశారు. బ్యాంక్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ బ్యాంకు వ్యవస్థపైన అనేక మైనటువంటి అంశాలను నేటి తరం యువతకు వృత్తి ఉద్యోగం ఉపాధి కల్పనలో బ్యాంకు వ్యవస్థ అనేకమైనటువంటి సదుపాయాలను కల్పిస్తుందని విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకుని సొంత వ్యాపారానికి ఏర్పాటు చేసుకునే వారికి కూడా బ్యాంకు ప్రోత్సాహం రుణ సదుపాయాన్ని కల్పిస్తుందని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ రావు అధ్యాపకులు డాక్టర్ చార్లీ, ఎస్.కె అజిత్, పున్నం,డాక్టర్ సుందరయ్య, రాజేష్, సాయికుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.