Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: చిన్న ప్రాణులకు పెద్ద సాయం

Garla: చిన్న ప్రాణులకు పెద్ద సాయం

ప్రత్యేకంగా దాణా, నీటి వసతి ఏర్పాటు

పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోహిణి కార్తె ప్రవేశిస్తే రోళ్లు పగులుతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు నిమిషాలు ఎండకెళ్లొస్తే గొంతు ఎండుకుపోతున్నది. పది నిమిషాలకోసారి పెదవులపై, గొంతులో నీటి తడి పడకపోతే కండ్లు తిరిగేలా భానుడు మండుతున్నాడు. అన్ని వసతులు ఉన్న మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పక్షులు, ఇతర జీవజాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నీరు కూడా లభించక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు నీరు దొరుకక చనిపోతున్న పక్షుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని ఇటీవల ఓ సర్వే చెప్పిన విషయాలు బాధను కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు పక్షి ప్రేమికులు వాటికోసం ప్రత్యేకంగా నీటి వసతి కల్పిస్తున్నారు. మట్టి, ఇతర పాత్ర ల్లో వాటి కోసం నీటిని పోస్తున్నారు. దాణా కూడా వేస్తున్నారు.

- Advertisement -

పక్షులనే ప్రేమించక పోతే ఇంకా ప్రేమను ఎలా పంచుతామని ప్రశ్నిస్తున్నారు. ‘వీలైతే నీళ్లు పోద్దాం.. కుదిరితే దాణా వేద్దాం డూడ్‌’ అంటూ పలువురికి పిలుపునిస్తున్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ కు చెందిన యువ సంకీర్త్ నిర్మలా హైస్కూల్ ఆరవ తరగతి చదువుతున్నాడు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఓ పక్షి చనిపోయి ఉండటానికి చూసి చలించిపోయి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుపైకి చిన్నచిన్న పక్షులు రావడాన్ని గమనించి తన వంతుగా వాటికోసం చెట్టు కొమ్మకి బాక్స్ లాంటిది అమర్చి నీటితో పాటు ప్రత్యేకమైన దానని ఏర్పాటు చేశాడు. ఎండలు మండుతున్నాయని పక్షులు నీటిని తాగకపోతే చనిపోయే పరిస్థితిలు వచ్చాయని వాటిది కూడా ప్రాణమే కదా అందుకే వాటి కోసం నా వంతుగా నీరుతో పాటు ప్రత్యేకమైన దానను పెట్టి పక్షి ప్రేమను చాటుతున్నానని, ఇలా పక్షుల కోసం నీరు దాన పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఇలా ప్రతి ఒక్కరు పక్షుల కోసం నీళ్లు దాన ఏర్పాటు చేయాలి పిలుపునిచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News