రానున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. గార్ల మండల పరిధిలోని కృష్ణ తార ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడి పోరాటం చేయడమే కాకుండా నిరుద్యోగుల కోసం కొట్లాడిన వ్యక్తి మల్లన్న అన్నారు.
పట్టభద్రులు సీరియల్ నెంబర్ 2 లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి ఎంపీపీ బట్టు నాగరాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి ఎస్సీ సెల్ నాయకులు సుందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణమహబూబాద్ జిల్లా నాయకులుకట్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ భూక్య నాగేశ్వరావు, మాజీ ఎంపీపీ వెంకట్ లాల్,సీనియర్ నాయకులు మండా రాము, శీలంశెట్టి ప్రవీణ్,చిలకబాబు, పాష, మోతిలాల్, హతిరం, ఈర్య, వీరస్వామి, లింగస్వామి, వెంకన్న, బోస్, హరి, మాణిక్యరావు,వెంకటేశ్వర్లు, గుడిచుట్టూనవీన్ యాదవ్ టిపిసిసి సోషల్ మీడియా గార్లమండల కోఆర్డినేటర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.