Saturday, October 12, 2024
HomeతెలంగాణGarla: గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

Garla: గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

పోషణ మాసం

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్‌ సీడీపీవో లక్ష్మి సూచించారు. గార్ల మండలం రాంపురం పంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల పోషక పదార్థాలను ప్రదర్శించి గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేసి వాయినాలు అప్పగించారు. ఈ సందర్భంగా సిడిపిఓ లక్ష్మీ మాట్లాడుతూగర్భిణులు, బాలింతలు పోషకాహారం భుజించాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గల పోషకాహారం గురించి వివరిస్తూ గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సంపూర్ణ అంగన్వాడీ టీచర్లు పద్మ సుజాత సరిత శ్రీలక్ష్మి కనకధారా సరస్వతి లక్ష్మీ ఆయా లలిత బాలింతలు గర్భిణీ స్త్రీలు తల్లులు చిన్నారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News