Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Garla: అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

పండుగ సందడితో కళకళలాడిన గార్ల

దసరా నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజైనా శనివారం గార్ల మండలంలో ఆడపడుచులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గార్ల మండంలోని అన్ని గ్రామాలలో మహిళలు, ఆడపడుచులు బతుకమ్మ సంబరాలలో మునిగినారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఎంగిలి పూలబతుకమ్మ నుండి నవరాత్రులు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపోకోవడానికి అత్యుత్సాహంగా సన్నాహాలు చేస్తారు. కొత్తగా పెండ్లి అయిన ప్రతి ఆడపడుచు, అత్తవారింటి నుండి తమ పుట్టింటికి వచ్చి ప్రకృతి వరంగా ఈకాలంలో అడివిలో అరుదుగా పూసే తంగేడు, గునుగుపూలు, గుమ్మడిపూలు, సీతమ్మ జడపూలు, మందారపూలు.. గోరంటప్పూలు, రుద్రాక్షపూలు, తీరొక్క రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఊరులోని మహిళలందరు ఒకచోటకు చేరి బతుకమ్మ ఆటలు ఆడారు మండల కేంద్రంలో మొదటి రోజు మహిళలు మద్యాహ్నం పూట కడుపుకు ఎంగిలిపడి ఒకరోజు ముందుగా సేకరించిన తీరొక్క పూలతో ఎంగిలి బతుకమ్మ పేర్చిన. ఆడపడుచులు ప్రతిఇంటినుండి బతుకమ్మను నెత్తిన పెట్టుకుని సాయంకాలం స్థానిక శివాలయంలో చేరుకుని ఓకే చోట బతుకమ్మలనుంచి, బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ.. ఉయ్యాలో అంటు మహిళలు బతుకమ్మ పాటలు, ఆటలతో, కోలాటాలు ఆడి అన్ని బతుకమ్మలను పరమశివుని ఎదుట ఉన్న కోనేటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసి ముత్తయిదువులు ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకొని కార్యక్రమాన్ని పూర్తిచేశారు. గ్రామపంచాయితీ ఆద్వర్యంలో సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ బతుకమ్మల వద్ద మహిళలకు ఇబ్బందులు కలగకుండా కరెంట్ దీపాలతో భారీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన బతుకమ్మ పండుగ విశిష్టత గూర్చి వివరించారు. ఎస్సై భానోత్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమామహేశ్వరరావు వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్. అధికసంఖ్యలో మహిళలు, పంచాయితీ సిబ్బంది, పిల్లలు, యువతీయువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News