Saturday, September 28, 2024
HomeతెలంగాణGarla: కలెక్టర్ సుడిగాలి పర్యటన

Garla: కలెక్టర్ సుడిగాలి పర్యటన

ఆకస్మిక తనిఖీలు..

గార్ల మండలంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆద్వైత్ కుమార్ సింగ్ సుడిగాలి పర్యటన నిర్వహించి, ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడీ కేంద్రలు ఆసుపత్రి సబ్ సెంటర్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా పరిషత్ హైస్కూల్,ఎస్సిబాయ్స్ హాస్టల్, గుంపెళ్లగూడెం, గార్ల అంగణ్ వాడీ కేంద్రాలు, పల్లె దవాఖాన, ముల్కనూర్ హైస్కూల్, మండల ప్రజా పరిషత్ హైస్కూల్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు బాలింతలకు షెడ్యూల్ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా వైద్య శిబిరాలను నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి ‘జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించి మందులు అందించాలని కోరారు.

వసతి గృహలలో మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్ భోజనం అందించాలని సంబంధిత వార్డెన్ లను. ప్రిన్సిపల్స్ స్థానికంగా ఉంటూ నిత్యం పిల్లలను గమనిస్తూ వైద్య, సిబ్బందితో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం, త్రాగునీరుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధనలు అందించాలని కోరారు.

మనఊరు- మనబడి కార్యక్రమంలో చెపట్టిన అన్ని పనులను వెంటనే పూర్తి చెయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూమ్, వంట గదులను డైనింగ్ హాల్ ను తనిఖీచేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మండల స్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు జిల్లాలో వైద్యం, విద్య, ఆరోగ్యం సానిటేషన్ లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని.

ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయి అధికారులను మండలాల వారీగా ప్రత్యేక అధికారులుగా నియమించి నిత్యం పర్యవేక్షిస్తారనన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, డాక్టర్ హన్మంతరావు, పంచాయతి కార్యదర్శి కిషన్, ఉపాద్యాయులు మాలోత్ శివ నాయక్ రామచంద్రు. రమేష, సుందర్ కుమార్, గంగావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News