పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ సహకరించాలని సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం మద్దివంచ సమస్యాత్మకత గ్రామాలలో శనివారం 40 మంది సి ఆర్ పి ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలతో భారీ కవాతు నిర్వహించారు. అనంతరం సాయుధ దళాలకు ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకునేలా భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా గార్ల మండల వ్యాప్తంగా కేంద్ర బలగాలు పోలీసుల నిఘా నీడలో ఉందని గుర్తు ఎరిగి నడుచుకోవాలన్నారు. గ్రామాలలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించి గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కవాతులో హెడ కానిస్టేబుల్ బాలకృష్ణ కానిస్టేబుల్ మంగిలాల్ శ్రీనివాస్ సిరాజ్ పాషా హోంగార్డు రాము బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.