Sunday, July 7, 2024
HomeతెలంగాణGarla: అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనిఅందోళన

Garla: అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనిఅందోళన

ఉన్న రెండూ పనిచేయవు

మండల కేంద్రంలో ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఆధార్ కార్డు సేవలకై ఇబ్బందులు తలెత్తకుండా మండల కేంద్రంలో మరికొన్ని ఆధార్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అదనపు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఎం అధ్వర్యంలో స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వికాస్ బ్యాంక్ లో ఉన్న ఆధార్ సెంటర్ నిరంతరం నడవకపోవడం, మరో సెంటర్ గత రెండు నెలల క్రితం నుండి నిలుపుదల చేయడం తో ఆధార్ సెంటర్ లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్నాయని విద్యార్థుల చదువులకు, రైతుల రుణాల మాఫీ, నూతన రుణాలు, మహిళలకు గ్యాస్ సబ్సిడీ తదితర అవసరాలకు ఆధార్ కార్డు అత్యవసరం అవుతుందని అన్నారు. ప్రస్తుతం రెండు సెంటర్ లూ నడవక పోవడంతో మానుకోట, ఖమ్మం, డోర్నకల్, బయ్యారం తదితర ప్రాంతాలకు వ్యయ, ప్రయాసలతో కూడిన ఇబ్బందులు పడుతున్నారని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆధార్ సెంటర్ రెగ్యులర్ గా నడవకపోవడం, అదనపు సెంటర్ లు లేకపోవడం వలన వృద్దులు, వికలాంగులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మండల కేంద్రంలో అదనపు ఆధార్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న అధార్ సెంటర్ లు నిరంతరం నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారు రవీందర్ కు అందించారు.

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్తానని తహశీల్దార్ రవీందర్ హమి ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు భూక్య హరి నాయక్, మండల నాయకులు వి.పి.వెంకటేశ్వర్లు, ఎ.వీరాస్వామి, బి‌.లోకేశ్వరావు, జె.సత్యం, కె.రామకృష్ణ, జి.వీరభద్రం,ఎస్.నాగరాజు, టి‌.నాగేశ్వరరావు,వీ.వీరభద్రం, వీరన్న, ప్రవీణ్, రమేష్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News