గార్ల మండల పరిధిలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గోపాలపురం పిన్ రెడ్డిగూడెం గ్రామాల్లో బోదకాలు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాధి స్వచ్ఛదనం-పచ్చదనంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి సరస్వతి మాట్లాడుతూ బోధ వ్యాధి సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాళ్ళ పరిశుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బోద వ్యాధిగ్రస్తులు పరిశుభ్ర పరచుకునే విధానాన్ని వివరించారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ అల్బెండజల్ మాత్రలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు భాగస్వాములై కలిసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయకూడదని, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్, గాజు సీసాల వ్యర్ధాలను డ్రైనేజీలలో వేయకూడదని మురుగునీటిని గుంటల వలన ఈ వర్షాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా ఉండి వాటి ద్వారా ప్రజలు అనేక వ్యాధులకు గురికావాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే గ్రామం పరిశుభ్రంగా ఉండటమే కాక ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.